నాగబాబు పారితోషికం నెలకి 30 లక్షలు?

  • పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
  • నెలకి 15 లక్షలు అందుకున్న నాగబాబు 
  • అంతకు రెట్టింపు ఇస్తున్న జీ తెలుగు
నాగబాబు చాలా కాలంగా 'జబర్దస్త్' కామెడీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన ఈ షో నుంచి తప్పుకుని, జీ తెలుగులో మరో కార్యక్రమానికి వెళ్లిపోయారు. ఆయన ఎందుకు మానేసి వెళ్లిపోయారనేది చర్చనీయాంశమైంది. ఆయన మానేయడానికి ప్రధాన కారణం పారితోషికమేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపించింది.

నాగబాబు కూడా ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ, తన స్థాయికి తగిన పారితోషికం కాకపోయినప్పటికీ 'జబర్దస్త్' కామెడీ షోలో చేశానని చెప్పారు. పారితోషికం కారణంగానే ఆయన ఆ షో నుంచి మానేశారనడానికి మరింత బలాన్ని చేకూరుస్తూ మరో వార్త షికారు చేస్తోంది. 'జబర్దస్త్' షోకి గాను గతంలో ఆయన నెలకి 15 లక్షలు అందుకున్నారట. జీ తెలుగువారు అంతకి రెట్టింపు ఇస్తామని చెప్పడంతో ఆయన అటు వెళ్లారని అంటున్నారు. ఇప్పుడు జీ తెలుగులో చేస్తున్న కార్యక్రమానికి గాను ఆయనకి పారితోషికంగా నెలకి 30 లక్షల రూపాయలను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం.
Go Back to Shorts
Nagababu

More Telugu News